19/6/2018
0 Comments
ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.
ఒక యదార్ధ విషయాన్ని మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే 20% పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది. CBN NEWS ప్రకారం 2017 లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు 2016 లో మొత్తం జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.
మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో, ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.
ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.
ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.
పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.
ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే ఒక రోజు లేక వ్యక్తి గతం గా అయితే ఒక గంట / అర గంట సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.
ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.
ప్రభువు సేవలో,
అపొస్తులు నాని బాబు నెల్లి,
స్థాపితులు,
ఇండియా ప్రేయర్ లీగ్,
7989 744 799
HTTPS://WWW.1CHURCH1DAY.ORG/INDIA-PRAYER-LEAGUE.HTML