ఇండియా ప్రార్ధనా కూటమి
ఒప్పంద ప్రార్థనలో బలమయిన శక్తి ఉంది
ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీ ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఆండ్రోయిడ్ ఫోన్ 1Church1Day అప్లికేషన్ ను డౌన్లోడ్ చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
|
నిర్ణయాలు మరియు ప్రార్థన అభ్యర్థనలు
భారతదేశం నుండి వ్యూహాత్మక నాయకులు ఈ ప్రార్థన లక్ష్యాలను, ఉత్తర్వులను నిర్ణయిస్తారు.
స్తుతి నివేదిక
పాస్టర్ జీవన్, గోకవరం. డెంగ్యూ జ్వరం వలన శరీరం లోని అవయవాలన్నీ బలహీనపడి 4 సార్లు రక్త సుద్ది యంత్రం ధ్వారా రక్తం సూది చేసిన ప్రాణం మీద అనుమానం అని చెప్పినా IPL టీం లో ప్రార్ధన ద్వారా దేవుడు తనను స్వస్థ పరచి మరల సేవలో బలముగా వాడుకుంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.
బ్రదర్ బాబు నెల్లి కాకినాడ నుండి ప్రార్ధన సహాయాన్ని కోరారు. అయన డయాబెటిస్ వలన బలహీన పది కోమా లోకి వెళ్లేంతగ వ్యాధి కి గురి అయ్యారు. ఐపీల్ టీం ప్రార్ధించగా ప్రభువు కార్యం చేసారు, దేవుడు డాక్టర్స్ చెప్పిన సమయమునకు ముందుగానే తిరిగి కొల్కిని దేవుని సాక్షిగా ఉన్నారు. ప్రభువు కె మహిమ కలుగును గాక
పాస్టర్ రాజు గారి సంఘ లో సేవకునికి లోబడని వాక్య విరుద్ధంగా ఆధిపత్యాన్ని చేస్తున్న ప్రజలనుండి దేవుడు విముక్తినిచ్చారు . సంఘ లో సమాధానాన్ని ప్రభువు కలిగించారు
వివాహ జరిగి 15 సంవత్సరాలైనా సంతానం లేక బాధ పడుచున్న బ్రదర్ భూషణ్ గారి జీవితం లో ఒక గొప్ప కార్యం చేశారు, ప్రార్ధించి ప్రభువు మీకు బిడ్డను కాదు కవలలను ఇస్తున్నారు అని ప్రవసించి చెప్పగా, 2 నెలల తిరగకుండా దేవుడు గర్భాన్ని తెరిచారు. దేవుడు ఇచ్చేది బిడ్డ లేక బిడ్డలో వేచి చూడాలి. దేవుడు నమ్మదగిన వాడు.
2017 సంవత్సరములో IPL లో ప్రార్ధన సహవాసం లో ఉన్న సేవకులు యొక్క సేవలో దేవుని శక్తిని పొంది బలపరచ పడుతున్నారు. పాస్టర్ కుమార్ జలపావారి గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి సహవాసం లో కొనసాగుతున్నారు. మందిరానికి స్థలం ఉన్నప్పటికీ మందిరం ప్రారంభించలేక పోయారు. IPL లో వారి కొరకు ప్రార్ధించి, అపోస్తులు నాని బాబు గారు సేవకుణ్ణి దర్శించి బలపరచి ఆ స్థలములో ప్రార్ధించ గా 3 మాసములలో మందిరం పూర్తి అయ్యి సంఘ ము ఆరాదించుకొనుటకు సిద్ధం అయ్యింది. ప్రభువుకే మహిమ కలుగును గాక. ( IPL ప్రార్ధన తప్ప ఆర్ధికంగా ఏమాత్రం సహకరించ లేదు )
పాస్టర్ రాజా బాబు గారు ప్రారంభించిన మందిరం అసంపూర్ణత నుండి సుందరంగా కట్టపడుటకు ప్రభువు కృప చూపారు. ( IPL ప్రార్ధన తప్ప ఆర్ధికంగా ఏమాత్రం సహకరించ లేదు )
IPL సేవకులు నూతన స్థలంలో సేవలను ప్రారంభించుటకు దేవుడు వారిని బాల పరిచారు. IPL లో ప్రార్ధనల ద్వారా 3నూతన సేవలు 2017 సంవత్సరంలో ప్రారంభి కొనసాగుతున్నాయి.
అపోస్తలు టిమ్ గారి యొక్క తెలుగు వ్యాసాలు, మరియు అపోస్తులు నాని గారి ప్రసంగాలు, నెలసరి తెలుగు నివేదికలు ఇక్కడ మీరు ఉచితంగా పొందవచ్చు
![]()
|
![]()
|
![]()
|
అపోస్తులు నాని బాబు నెల్లి, సహవాస స్థాపితులు ఇండియా ప్రార్ధనా కూటమి, +91 7989 744 799 Director and Senior Pastor in Jesus Christ Prayer House https://www.facebook.com/pastor.nani |
అపోస్తులు టిమ్ టేలర్ గారు అంతర్జాతీయ సహవాస స్థాపితులు, 1C1D వ్యూహాత్మక ప్రార్ధన నిర్మాణకులు గౌరవ అధ్యక్షులు. ఇండియా ప్రార్ధనా కూటమి kingdomleague.org/ |